మీ ఆశీస్సులు అలా అందించండి… మల్లాపూర్ లో విచిత్ర ప్రచారం

పెళ్లి సందడిలో వధూవరుల తీరు…

దిశ దశ, కోరుట్ల:

వివాహానికి వచ్చిన పెద్దలు వధూవరులను ఆశీర్వదించేందుకు వేదికపైకి వెళ్లారు. అక్షింతలు తీసుకుని దంపతులను ఆశీర్వదించేందుకు వారి వద్దకు వెళ్లగానే వారి చేతిలో ఓ కరపత్రం ఉంచారు. దయచేసి మీరు ఈ అభ్యర్థికి ఓటేసి గెలిపించండి… మీరందించే ఆశీర్వాదాలు మాకివేనంటూ నూతన వధూవరులు అభ్యర్థించిన తీరు చూసి పెళ్లికి హాజరైన వారంతా అవాక్కయ్యారు.

ఇంతకీ ఏం జరిగిందంటే…

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ కు చెందిన బాల్సాని ప్రణయ్ గౌడ్, కీర్తనల వివాహం అంగరంగ వైభవండా జరిగింది. వీరి పెళ్లికి హాజరైన బంధువులు నూతన దంపతులను ఆశీర్వదించేందుకు వెళ్లిన వారికి షాకిస్తూ ఈ సారి మీ ఓటు కాంగ్రెస్ పార్టీకే వేయాలంటూ కరపత్రం అందించడం మొదలు పెట్టారు. వారిని ఆశీర్వదించే ప్రతి ఒక్కరికి కరపత్రం ఇస్తూ మీ ఓటు మాత్రం ఖచ్చితంగా కోరుట్ల కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావుకు వేయాలని కోరారు. దీంతో మొదట అవాక్కయిన వధూవరుల బంధువులు ఆ తరువాత ఘెల్లుమని నవ్వుకున్నారు. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని ఆశీర్వదించేందుకు మేం వస్తే మీరేంటి ఇలా కాంగ్రెస్ అభ్యర్థి నర్సింగ రావుకు ఓటేయాలని కోరుతున్నారంటూ కొంతమంది ప్రశ్నించారు. అయితే తమకు అభిమాన నాయకుడు అయినందున మా మ్యారేజీ సందర్భంగా వారి ప్రచారం చేసి తమవంతు సహకారం అందించాలని నిర్ణయించామని ప్రణయ్ వివరించారట. అయితే ఆశీర్వాదాలతో పాటు ఓటు గురించి కూడా ప్రచారం చేసిన తీరు గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రణయ్, కీర్తనల గురించే చర్చించుకోవడం మొదలు పెట్టారు.

2023 assembly electionsJAGITIAL NEWSkorutlaLatest Newstelangana newsThe bride and groom campaigned at the wedding ceremony