ఉగ్రవాదుల అడ్డా… హైదరాబాద్ గడ్డ

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్

గ్రేటర్ హైదరాబాద్ బల్దియాలో వెలుగులోకి వచ్చిన నకిలీ బర్త్ సర్టిఫికెట్ వ్యవహారంలో సమగ్ర విచారణ జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. మంగళవారం కరీంనగర్ లో ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యులో ఆయన మాట్లాడుతూ… ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయిందని, నకిలీ సర్టిఫికెట్లతో టెర్రరిస్టులు ఇక్కడే నివాసం ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఓ వర్గం ఓట్ల కోసం కొమ్ము కాస్తోందని, హైదరాబాద్ లో అక్రమంగా డెన్ ఏర్పాటు చేసుకుని ఉంటున్న వారిని ఇక్కడి నుండి తిప్పి పంపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీలో జరుగుతున్న అక్రమాలపై బీజేపీ కార్పోరేటర్లు పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నారని పూర్తి నివేదికలు వచ్చిన తరువాత పార్టీ పోరాటం చేస్తుందని బండి సంజయ్ ప్రకటించారు.

bandi sanjaybandi sanjay kumarbandi sanjay mpbjp newsterror links