సిరికొండకు ఉద్యమకారుల అండ…

టవర్ ఎక్కి నిరసన

భూపాలపల్లిలో ఉద్రిక్తత

దిశ దశ, భూపాలపల్లి:

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనా చారికే టికెట్ ఇవ్వాలంటూ పలువురు ఉద్యమకారులు టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మద్యాహ్నం ఉద్యమకారులు కొంతమంది టవర్ ఎక్కి సిరికొండకే టికెట్ ఇవ్వాలని వలస పక్షులకు ప్రాధాన్యత ఇవ్వొద్దంటూ నినాదాలు చేస్తున్నారు. శ్రీకాంత్, పూర్ణ చందర్, పృథ్విలు టవర్ ఎక్కి మధుసూధనా చారికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సిరికొండ అభిమానులు… కావాలి మధన్న, రావాలి మధన్న అంటూ నినాదాలు చేస్తున్నారు. ఉద్యమ ప్రస్థానం నుండి పార్టీలో ఉన్న మధుసూధనా చారికి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్లకు అవకాశం ఇవ్వకూడదంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు భూపాలపల్లి అభ్యర్థి విషయంలో ఆలోచించాలన్నారు. ఉద్యమ సమయంలో రాళ్లు విసిరి, తుపాకులు ఎక్కిపెట్టిన ద్రోహులను పార్టీలో చేర్పించుకుని వారికి అందలం ఎక్కించవద్దని వారు వేడుకుంటున్నారు. అధిష్టానం సిరికొండకు అనుకూలంగా నిర్ణయంతీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గండ్ర రమణారెడ్డికే టికెట్ ఇచ్చినట్టియితే 200 మంది ఉద్యమ కారులమంతా కూడా బరిలో నిల్చుమంటామని వారు స్పష్టం చేస్తున్నారు.

BHUPALPALLYBRS NEWScm kcrKCRLatest Newstelangana news