మేడం… మీరు రావాలి….

మేడం మీరు రావాలి… అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను అభ్యర్థించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. త్వరలో జరగనున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా చట్ట సభల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించాలని కోరారు. మంత్రి వేములతో పాటు ఆర్థిక శాఖ అధికారులు కూడా గవర్నర్ తమిళిసైని ఆహ్వానించిన వారిలో ఉన్నారు.


ఆరు బిల్లులకు ఆమోదం…

గవర్నర్ పేషీలో పెండింగ్ లో ఉన్న ఆరు బిల్లకు తమిళిసై క్లియరెన్స్ ఇచ్చారని తెలుస్తోంది. ఆరు బిల్లులకు సంబందించిన గెజిట్ ప్రక్రియ కూడా వెలువడనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాలకు మోక్షం కలగనుంది.

cm kcrGovernorGOVERNOR TAMILISAIKCRLatest Newstelangana news