తెలంగాణ సీఎం ఎన్నిక వాయిదా…

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ సీఎం ఎన్నిక ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. సోమవారం రాత్రి రాజ్ భవన్ లో నిర్వహించాల్సిన ప్రమాణా స్వీకారోత్సవాన్ని వాయిదా వేసినట్టుగా సమాచారం. ఉధయం సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి సీఎం అభ్యర్థి ఎవరనేది ఏఐసీసీ నిర్ణయం తీసుకుని పంపించాలన్న ఏక వాక్య తీర్మాణాన్ని పంపించారు. క్యాబినెట్ కూర్పునకు సంబంధించిన అంశాలు కూడా ఏఐసీసీ పరిశీలకులు చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఎల్పీ నేత ఎవరిని ఎన్నుకోవాలో అన్న విషయంపై ఏఐసీసీ క్లారిటీ ఇవ్వకపోవడంతో ప్రమాణ స్వీకారోత్సవం వాయిదా పడింది. అయితే కొద్ది సేపటి నుండి మాత్రం సీనియర్ ఎమ్మెల్యేలు సమావేశం నుండి బయటకు వెల్లిపోయారన్న ప్రచారం సోషల్ మీడియా వేదికగా సాగుతోంది. ఇదే సమయంలో ప్రమాణ స్వీకారోత్సవం వాయిదా పడడంతో అసలేం జరుగుతుందోనన్న చర్చ మొదలైంది.

2023 assembly electionsTelangana CM's swearing-in ceremony postponed..?telangana news