మీ ప్రతిపాదనకు ఓకె: చంద్రబాబుకు రేవంత్ లేఖ

దిశ దశ, హైదరాబాద్:

విభజన తరువాత అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చించుకునేందుకు ఈ నెల 6న భేటీ అయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ సీఏం నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యుత్తరం రాశారు. విభజన అంశాలపై చర్చింకునేందుకు ఈ నెల 6న ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసుకుందామని ఏపీ సీఏం లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇందుకు స్పందించిన తెలంగాణ సీఏం భేటీ అయ్యేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. దీంతో 6వ తేదిన గురు శిష్యులు ముఖ్యమంత్రుల హోదాలో సమావేశం కానున్నారు. 6వ తేది మద్యాహ్నం మహాత్మ జ్యోతి బా పూలే భవన్ లో భేటీ అవుదామని చంద్రబాబుకు రేవంత్ రెడ్డి వెల్లడించారు. 

AP CM CHANDRA BABU NAIDUap newscm revanth reddynara chandrababu naidutelangana cm