ఇక రాజయ్య శ్రీహారి నామ జపం…

మారిన సమీకరణాలు…

శాంతించిన తాటికొండ

దిశ దశ, జనగామ:

స్టేషన్ ఘన్ పూర్ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మంత్రి కేటీఆర్ మంత్రాంగంతో సిట్టింగ్ ఎమ్మెల్యే శాంతించడంతో కొత్త అభ్యర్థికి లైన్ క్లియర్ అయిపోయింది. శుక్రవారం ప్రగతి భవన్ వేదికగా జరిగిన చర్చలు సఫలం కావడంతో స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ లో విబేధాలు సమిసిపోయాయి. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలు తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరిలతో చర్చలు జరపడంతో వివాదం సద్దుమణిగిపోయింది. ఇకనుండి తన మద్దతు కడియం శ్రీహరికేనని తాటికొండ రాజయ్య వెల్లడించారు. తాటికొండకు కూడా పార్టీ పరంగా అన్ని విధాలుగా అండగా నిలుస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇవ్వడంతో రాజయ్య వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి మద్దుతు ఇస్తున్న్టట్టుగా తెలుస్తోంది. స్టేషన్ ఘన్ పూర్ లో నువ్వా నేనా అనుకున్న ఇద్దరు సీనియర్ నేతల మధ్య సయోధ్య నెలకొనడంతో బీఆర్ఎస్ అధిష్టానానికి కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ నియోజకవర్గంలో మారిన సమీకరణల ప్రభావం ఇరుగు పొరుగు నియోజకర్గాల్లోనూ పడే అవకాశం లేకలపోలేదు.

cm kcrKCRLatest NewsTatikonda Rajaiah declares support for Kadiamtelangana news