ధర్మపురి ‘విండో’’లో నిధుల దుర్వినియోగం…

చర్య తీసుకోవాలని వినతి

దిశ దశ, జగిత్యాల:

ధర్మపురి సింగిల్ విండోలో భారీగా నిధులు దుర్వినియోగం అయినందున చర్యలు తీసుకోవాలని జె సురేందర్ కుమార్ కోరారు. సహకార సంఘంలో అవకతవకలు జరిగాయని గతంలోనే జిల్లా సహాకర అధికారి నిర్ధారించడంతో పాటు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారన్నారు. ఈ మేరకు సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో దరఖాస్తు చేసిన సురేందర్ కుమర్ షోకాజ్ నోటీసులను కూడా అందించారు. సొసైటీలో రూ. ఒక కోటి 24 లక్షల 30 688 మేర నిధులు అవతవకలు జరిగినందున ప్రజా ధనాన్ని రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆ వినతి పత్రంలో కోరారు.

DharmapuriJAGITIALtelangana newsTG NEWS