సర్కారు బడిలో క్షుద్ర పూజల కలకం…

ఆందోళనలో తల్లిదండ్రులు

దిశ దశ, జగిత్యాల:

జగిత్యాల జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం సృష్టిస్తున్నాయి. జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఆవరణలోనే గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేయడం సంచలనంగా మారింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… జిల్లాలోని భీమారం మండలం మన్నెగూడెం ప్రభుత్వ పాఠశాలలోని తరగతి గదుల ముందు నిమ్మకాయులు, పసుపు, కుంకుమ, కోడిగుడ్లతో పాటు ఇతరాత్ర పూజా సామగ్రి ప్రత్యక్ష్యం కావడం గ్రామస్థులను ఆందోళనకు గురి చేసింది. మంగళవారం అర్థరాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల ఆవరణలో కుద్ర పూజలు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. బుధవారం పాఠశాల తరగతి గదుల ముందు కనిపించిన ఆనవాళ్లను గమనించిన గ్రామస్థులు క్షుద్ర పూజలు చేసిన విషయం తెలిసిందని వివరించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.

JAGITIAL NEWSJagityal districtkarimnagar newsLatest Newstelangana news