జనశక్తి మాజీ నక్సల్ దంపతుల ఆత్మహత్యాయత్నం

దిశ దశ, వేములవాడ:

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జనశక్తి మాజీ నక్సల్ దంపతులు ఆత్యహత్యకు పాల్పడిన ఘటన సంచలనం కల్గించింది. జిల్లాలోని కోనరావుపేట మండలం కొండాపూర్ లో చోటు చేసుకున్న ఈ ఘటనలో మల్యాల నందం, అతని భార్య పద్మలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. లొంగిపోయిన తరువాత నందకు అప్పటి అధికారులు కొండాపూర్ శివార్లలోని సర్వే నెంబర్ 116ఏలో ఎకరం 20 గుంటల భూమిని అధికారులు కెటాయించారు. గత పదేళ్లుగా ఇదే భూమిలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నందం నుండి భూమిని లాక్కునేందుకు రెవెన్యూ యంత్రాంగం ప్రయత్నిస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా సర్వేయర్ కుమార్ తనకు రూ. 50 వేలు లంచం ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని లేనట్టయితే భూమిని లాక్కుంటానన్నాడని వివరించారు. సోమవారం నందం సాగు చేసుకుంటున్న భూమి వద్దకు వచ్చిన వివిధ శాఖల అధికారులు ఫెన్సింగ్ వేస్తున్న క్రమంలో నందం అతని భార్య పద్మలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితులను సిరిసిల్ల జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

crime newsCRIME TODAYSuicide attempt by Janashakti ex-Naxal couple in Rajanna Sirisilla district