గూడురులో విద్యార్థుల రాస్తారోకో

దిశ దశ, మహబూబాబాద్:

టీచర్ల కొరత కారణంగా విద్యా బోధన సాగడం లేదంటూ ఏకంగా స్టూడెంట్స్ రోడ్డెక్కారు. మహబూబాబాద్ జిల్లా గూడురు మండలం పొనుగోడు ప్రభుత్వ పాఠశాలలో ఖాలీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చాలినంతమ మంది టీచర్లు లేకపోవడంతో విద్య అందుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన విద్యార్థులు గూడురు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. తమ స్కూలుకు వెంటనే టీచర్లను నియమించాలని స్టూడెంట్స్ కోరుతున్నారు. దీంతో ఈ రహదారిపై వాహనాల రాకపకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

Latest Newsmahaboobabadtelangana newswarangal