లాజిస్టిక్ వాహనాల్లో లాజిక్ గా నగదు రవాణా…

ఎస్ఓటీ దాడులతో వెలుగులోకి…

దిశ దశ, హైదరాబాద్:

క్యాష్ లాజిస్ట్ వాహనాలు కూడా నగదు అక్రమ రవాణాకు ఉపయోగపడుతున్నాయి. బ్యాంకులకు నగదు బట్వాడా చేసే తమ గురించి ఎవరూ పట్టించుకోరన్న ధీమాతో లెక్కకు మించిన నగదును తరలిస్తున్నట్టుగా తేలింది. ఇటీవల స్పెషల్ ఆపరేషన్ టీమ్స్. (ఎస్ఓటి) తమ దృష్టిని వీటిపై సారించడంతో అనుమతి లేకుండా తీసుకెళ్తున్న నగదు దందా గురించి బయటపడుతోంది. తాజాగా బుధవారం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఎస్ఓటీ టీమ్స్ క్యాష్ లాజిస్టిక్ వెహికిల్స్ తనిఖీ చేయడంతో రూ. కోటి ఆరు లక్షల 62 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆరు వాహనాలను తనిఖీ చేసిన ఎస్ఓటీ బృందాలు అదనపు నగదును గుర్తించి సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించాయి.

crimecrime newsHyderabadsot cyberabad