మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి…

దిశ దశ, న్యూ ఢిల్లీ:

చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించాలన్న కళ స్వర్గీయ రాజీవ్ గాంధీదని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ అన్నారు. బుధవారం మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ… మహిళా రిజ్వరేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని, ఈ బిల్లును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆలస్యమైతే మహిళలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జన గణన చేపట్టి రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కాలయాపన చేయడం వల్ల మహిళలు మరింత కాలం చట్ట సభలకు దూరంగా ఉంచడమే అవుతుంది తప్ప మరోటి కాదన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన ప్రక్రియను అమలు చేయాల్సిందేని పట్టబట్టారు.

AICCLatest Newssonia gandhiSonia Gandhi's comments on the Women's Reservation Billwomen reservation bill