హైదరాబాద్ కు రానున్న సోనియాగాంధీ

దిశ దశ, హైదరాబాద్:

సోమవారం జరగనున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కలు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఉదయం 7 గంటలకు ముఖ్య నేతలంతా హాజరు కానున్నారు. ప్రముఖులందరికీ వీవీఐపీ సెక్యూరిటీ చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం హైదరాబాద్ లో జరగనున్న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అధికారులు.

Sonia Gandhi's arrival at Revanth Reddy's swearing-in ceremonytelangana cmtelangana cm revanth reddytpcc chief revanth reddy