ఆరు గొర్రెల మృతి
గొర్ల కాపరి పరిస్థితి విషయం
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్, పెద్దపల్లి రాజీవ్ రహదారిపై కొద్ది సేపటి క్రితం జరిగిన ప్రమాదంలో ఆరు గొర్రెలు చనిపోగా, గొర్రెల కాపరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముగ్దుంపూర్ స్కూల్ సమీపంలో శుక్రవారం మద్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. గోదావరిఖని నుండి కరీంనగర్ వెల్తున్న ఆర్టీసీ బస్సు మొదట ఆటోను ఢీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు అయ్యాయి. ఇదే సమయంలో రోడ్డు దాటుతున్న గొర్రెల మందను ఢీ కొట్టడంతో ఆరు గొర్రెలు అక్కడిక్కడే చనిపోగా, మరికొన్ని గాయాల పాలయ్యాయి. గొర్రెల కాపారి బండి సంపత్ కు తీవ్రగాయాలు కాగా ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి కరీంనగర్ రూరల్ పోలీసులు చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకుంటున్నారు.