ఎన్నికల పరిశీలకునిగా సిరాజ్

మహదేవపూర్ TO కరీంనగర్

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలన ప్రతినిధిగా డీసీసీ కార్యదర్శి ఎస్ కె సిరాజ్ హుస్సేన్ అపాయింట్ అయ్యారు. జిల్లాలోని నియోజకవర్గాల ఎన్నికల వ్యవహారాల పరిశీలన కోసం డీసీసీ ప్రతినిధిగా నియమిస్తున్నామని అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారులకు లేఖ రాశారు. ఇప్పటికే తాము నియోజకవర్గానికి ఇద్దరు ప్రతినిధులను ప్రతిపాదించినప్పటికీ వారికి కొన్ని సందర్భాల్లో అసౌకర్యం ఎదురవుతున్నందున కరీంనగర్ కు చెందిన సిరాజ్ హుస్సేన్ ను జిల్లా ప్రతినిధిగా ఎంపిక చేశామని కవ్వంపల్లి తెలిపారు. ఎన్నికల అధికారులకు అందుబాటులో ఉంటూ ఎన్నికల వ్యవహారాలకు సంబంధించిన అంశాలను పర్యవేక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ తరుపున జిల్లా ప్రతినిధిగా సిరాజ్ హుస్సేన్ కు సమాచారం ఇవ్వాలని డీసీసీ అధ్యక్షుడు కోరారు.

మహదేవపూర్ టు…

నూతన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలకేంద్రానికి చెందిన సిరాజ్ హుస్సేన్ కరీంనగర్ లో స్థిరపడ్డారు. 2006 నుండి మహదేవపూర్ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా, మైనారిటీ సెల్ మండల అధ్యక్షునిగా, జిల్లా వక్ఫ్ బోర్డు మెంబర్ గా పని చేశారు. వివిధ దినపత్రికలలో జర్నలిస్టుగా కూడా పని చేసిన సిరాజ్ హుస్సేన్ ప్రస్తుతం డీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

karimnagar congresskarimnagar newsLatest NewsPoliticstelangana newstpcc