పోలీసులను వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు


నిన్న కానిస్టేబుల్ నేడు ఎస్సై మృతి

దిశ దశ, భూపాలపల్లి:

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు పోలీసులను వెంటాడుతున్నాయి. సోమవారం జగిత్యాల జిల్లాలో మహిళా కానిస్టేబుల్ మృత్యువాత పడగా మంగళవారం ములుగు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సెకండ్ ఎస్సై ఇంద్రయ్య, ప్రైవేటు డ్రైవరు చనిపోవడం విషాదాన్ని నింపింది. ములుగు జిల్లా ఏటూరునాగారం, కమలాపూర్ రహదారిలోని వాగుపై అదుపుతప్పి పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఏటూరునాగారం సెకండ్ ఎస్సై ఇంద్రయ్య. ప్రైవేటు డ్రైవర్ అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు.

crimecrime newsCRIME TODAYLatest Newstelangana newstoday crime news