కవిత తీరు వల్ల అవమానం

మాజీ ఎంపీ పొన్నం

ఎమ్మెల్సీ కవిత వ్యవహారం వల్ల తెలంగాణ మహిళా సమాజానికి ఇది అవమానకరమైన రోజని మాజీ ఎంపీ, ఏఐసీసీ నాయకులు పొన్నం ప్రభాకర్ అన్నారు. కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ… అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కవిత లిక్కర్ వ్యాపారానికి సంబందించిన అక్రమాలలో విచారణ నోటీసులు అందుకోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ఆడపడుచుగా ఉన్న కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో దొరకడం విచారకరమన్నారు. అయితే అరుణ్ పిళ్లై స్టేట్ మెంట్ తో కవితను అరెస్ట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం కూడా నాటకాలడుతోందని పొన్నం ఆరోపించారు. ఈ వ్యవహారంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో దోబూచులాడుతున్నారని పొన్నం ఆరోపించారు. వెంటనే కవితను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Delhi Liquor ScamLatest NewsLiquor scamMLC KAVITHAPONNAM PRABHAKARtelangana news