గడ్చిరోలి జిల్లాలో ఎన్ కౌంటర్: పలువురు నక్సల్స్ మృతి…

ఒక జవాన్ మృతి, మరోకరికి గాయాలు

దిశ దశ, దండకారణ్యం:

మహారాష్ట్ర, చత్తీస్ గడ్ సరిహధ్దుల్లోని అటవీ ప్రాంతంల్లో గురువారం రాత్రి నుండి ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. గడ్చిరోలి జిల్లా భామ్రాఘడ్ అటవీ ప్రాంతంలో C60 జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎన్ కౌంటర్ జరిగినట్టుగా పోలీసు వర్గాల సమాచారం. భామ్రాఘడ్ తాలుకాలోని ఇంద్రావతి నది పరివాహక ప్రాంతం, చత్తీస్ గడ్ లోని నేషనల్ పార్క్ సరిహద్దుల్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. పోలీసు వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం ఘటనా స్థలం నుండి ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకోగా 1 AK47, 1 SLR స్వాధీనం చేసుకున్నారు. అయితే గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 10 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. అధికారికంగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జవాన్ మృతి…

భామ్రాఘడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు C60 జవాన్లకు గాయాలయ్యాయి. వీరిలో దీపక్ చిన్న మాడావి (38), జోగా మడావి అనే తీవ్ర గాయాలు కావడంతో హెలిక్యాప్టర్ ద్వారా వైద్యం కోసం తరలించారు. వీరిలో దీపక్ చిన్న మడావికి బుల్లెట్ గాయాలు తీవ్రంగా తగలడంతో మరణించినట్టుగా పోలీసు అధికారులు వివరించారు. మరో జవాన్ జోగా మడావిని గడ్చిరోలికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Bhamraghaddandkaranyamencountergadchiroli newsmaoist news
Comments (0)
Add Comment