వేములవాడలో సంచలనం… ప్రైవేట్ స్కూల్ యజమాని ఐపీ నోటీసులు

దిశ దశ, వేములవాడ:

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఓ విద్యాసంస్థ యజమాని ఐపీ దాఖలు చేయడం సంచలనంగా మారింది. ఆయనకు అప్పు ఇచ్చిన వారికి కోర్టు ద్వారా నోటీసులు రావడంతో ఒక్కసారిగా షాక్ కు లోనయ్యారు. పట్టణంలోని సృజన ఎడ్యూకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో వివేకానంద స్కూల్ నిర్వహిస్తున్న గడీల ప్రసాద్ వేములవాడ కోర్టును ఆశ్రయించి ఐపీ నోటీసులు పంపించారు. ఈ నోటీసుల్లో మొత్తం 22 మందికి రూ. కోటీ 66 లక్షల అప్పు ఉన్నానని వీరందరికి ప్రామిసరీ నోటు రాసిచ్చాచని అందులో పేర్కొన్నారు. గడీల ప్రసాద్ కు అప్పు ఇచ్చిన వారంతా కోర్టు నోటీసులు అందుకోవడంతో ఆశ్యర్యానికి గురయ్యారు. విద్యా సంస్థ నిర్వహిస్తున్నాడన్న నమ్మకంతో అప్పు ఇచ్చామని, ఉన్నట్టుండి ఐపీ నోటీసులు పంపించడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని అప్పు ఇచ్చిన వారు అంటున్నారు.

ip noticeskarimnagar newsrajanna siricilla districtvemulawada