దండకారణ్యానికి దండిగా వెల్తున్న డబ్బు

పట్టుకున్న భూపాలపల్లి జిల్లా పోలీసులు

దిశ దశ, భూపాలపల్లి:

మావోయిస్టుల ఉనికి లేకున్నా పొరుగు రాష్ట్రాలకు వారి కోసం పార్టీ ఫండ్ వెల్తున్నట్టుగా ఉంది. తాజాగా భూపాలపల్లి జిల్లా పోలీసులు నలుగురిని పట్టుకోవడంతో మావోయిస్టులతో తెలంగాణకు ఉన్న సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. సంఘటనా వివరాల్లోకి వెల్తే… చత్తీస్ గడ్ దండకారణ్య అటవీ ప్రాంతానికి తరలివెల్తున్న డబ్బుతో పాటు, మెడికల్ కిట్స్, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియ రావల్సి ఉంది. ఈ మేరకు జిల్లా ఎస్సీ సురేందర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు.

bhupalapallychattisgharcrime newsCRIME TODAYdandkaranyamLatest Newsmaoist newstelangana news