సర్కస్ ఫిట్లు చేస్తున్న కార్లు…

దిశ దశ, న్యూ ఢిల్లీ:

ప్రకృతి ప్రకోపంతో దండిగా వర్షాలు కురుపించినప్పుడు వరద నీటిలో వాహనాలు కొట్టుకపోవడం సహజం. రోడ్లపై పార్క్ చేసిన వాహనాలు ఆ ప్రవాహంలో కొట్టుకపోతున్న వీడియోలు నెట్టింట వైరల్ అయినప్పుడు చూసి అయ్యె పాపం అంటూ మధనపడి పోయాం. లక్షలు పోసి కొన్న కార్లు ఒక్క వరద నీరు లాక్కెల్తున్న తీరు చూసి చలించిపోయాం. అయితే ఒక్కో సారి వరద నీటి ప్రవాహంలో కొట్టుకపోతున్న కార్లు కూడా సర్కస్ ఫీట్లు చేస్తుంటాయి. ఈ సర్కస్ ఫిట్లు చేస్తూ ప్రవాహపు ఉధృతికి ఎదో ఒక చోట కార్లు కనిపించనంత దూరం కొట్టకపోతుంటాయి. కానీ గుజరాత్ లో మాత్రం ఓ విచిత్ర సంఘటన జరిగింది. వరద నీటిలో కొట్టుకపోయిన కార్లు కొన్ని జునాఘడ్ ఏరియాలో ఓ చోట పార్క్ చేసినట్టుగా ఆగిపోయాయి. అవి ఒకదానిపై ఒకటి తట్టుకుని ఆగిన తీరు సర్కస్ ఫిట్లను మరిపిస్తున్నప్పటికి వాటిని గమనిస్తే ఎవరో కావాలనే అలా పార్క్ చేశారా అన్న అనుమానం కలగక మానదు. కానీ వరద నీటిలో ఒకదానిపై ఒక కారు నిలిచిపోయి ఎక్కడికక్కడ ఆగిపోయాయి. విచిత్రంగా పార్క్ అయిన కార్లకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

2023 heavy rainsFloods 2023GujaratLatest Newstelangana newsViral