రెండు రోజుల పాటు బడులు బంద్

మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్రంలో కురుస్తున్న అధిక వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే కొన్ని జిల్లాలు రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ లకు చేరుకున్నాయి. దీంతో చిన్నారుల ఆరోగ్యంతో పాటు క్షేమంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో రెండు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొద్ది సేపటి క్రితం ట్విట్టర్ ద్వారా గురు, శుక్రవారల్లో స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తామీ నిర్ణయం తీసుకున్నామని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
https://twitter.com/SabithaindraTRS/status/1681858624619171841?t=GCLjrtMfXwgSozNlDk2wZw&s=19

cm kcrLatest NewsSabitha Indra ReddySchool holidays for two daystelangana news