రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ మృతి…


దిశ దశ, హుజురాబాద్:

కరీంనగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ సర్పంచును బలి తీసుకుంది. శంకరపట్నం మండలం కొత్తగట్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొమురారెడ్డి మృత్యువాత పడ్డారు. శనివారం తెల్లవారు జామున జరిగినట్టుగా భావిస్తున్న ఈ రోడ్డు ప్రమాదంలో హుజురాబాద్ మండలం కనుకులగిద్దె సర్పంచ్ గోపు కొమురారెడ్డి చనిపోయారు. టీఎస్02ఈవి, 5558 నెంబరు గల కారు అదుపు తప్పి చెట్టుకు ఢీ కొన్నట్టు ప్రాథమికంగా నిర్దారించారు. కొమురారెడ్డి కరీంనగర్ నుండి హుజురాబాద్ వైపునకు వెల్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. శంకరపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. కొమురారెడ్డి మరణ వార్త విని హుజురాబాద్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈటల ముఖ్య అనుచరుడు…

బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్య అనుచరుడిగా ఎదిగిన కొమురారెడ్డి గత 15 ఏళ్లుగా గ్రామంలో క్రీయ శీలక రాజకీయాల్లో ఉండగా హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా కూడా పని చేసిన ఆయన ఈటల రాజేందర్ వెన్నంటి నడిచి బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న కొమురారెడ్డి ఈటల రాజేందర్ కు పార్టీ పరంగా, వ్యక్తిగతంగా కూడా అత్యంత ముఖ్య అనుచరుడిగా ఎధిగారు.

bandi sanjaycrime newsCRIME TODAYeatela rajendaretela rajenderhuzurabadLatest Newsroad accidenttelangana news