నోటీసులకూ నోట్ల కట్టలివ్వాల్సిందే… ఏసీబీ దాడిలో ఇద్దరు ఎస్సైల ట్రాప్…

దిశ దశ, హైదరాబాద్:

నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నా చేతులు తడపాల్సిందే. లంచం ఇవ్వకపోతే అరెస్ట్ చేస్తామన్న హెచ్చరించడమే. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవడానికీ మామూళ్లు ముట్టాల్సిందే. ఇది పోలీసు విభాగంలోని కొంతమంది అవినీతి అధికారులు తీరు. తాజాగా హైదరాబాద్ నగరంలో ఏకంగా ఇద్దరు ఎస్సైలు ఏసీబీకి ట్రాప్ అయిన ఘటన సంచలనంగా మారింది.

మ్యూల్ అకౌంట్…

సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని మ్యూల్ అకౌంట్ ద్వారా లావాదేవీలు జరిగిన విషయాన్ని గుర్తించిన పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఇద్దరు ఆర్మ్ డ్ రిజర్వూ సబ్ ఇన్స్ పెక్టర్లు లంచం తీసుకుంటుండగా రెడ్ హైండెడ్ గా పట్టుబడ్డారు. ఎల్ బి నగర్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒకరికి చెందిన మ్యూల్ అకౌంట్ ద్వారా సైబర్ క్రిమినల్స్ రూ. 2లక్షలు బదిలీ చేసుకుని ఆ తరువాత వేరే అకౌంట్లకు తరలించుకున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు ఓ వ్యక్తికి సంబంధించిన మ్యూల్ ఖాతా ద్వారా సైబర్ క్రిమినల్స్ లావాదేవీలు జరిపారని గుర్తించారు. దీంతో సదరు ఖాతాదారున్ని పిలిపించిన ఇద్దరు ఎస్సైలు అరెస్ట్ చేస్తామని అతనికి స్పష్టం చేశారు. అరెస్ట్ చేయకుండా నోటీసు ఇవ్వాలంటే మాత్రం రూ. 3 లక్షలు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. వాస్తవంగా 7 ఏళ్లకు తక్కువ కాలం జైలు శిక్ష ఉన్న సెక్షన్లలో అరెస్టులు చేయకుండా సెక్షన్ 35 BNSS (సీఆర్పీసీ 41) ప్రకారం నోటీసులు ఇవ్వాలంటే ఆ మాత్రం ఇచ్చుకోవల్సిందేనని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేస్తున్న ఏఆర్ ఎస్సైలు ప్రమోద్ గౌడ్, బాబులు డిమాండ్ చేశారు. ఎల్ బినగర్ చౌరస్తాలో రూ. లక్ష ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఇద్దరు ఎస్సైలను ట్రాప్ చేశారు. నిందితులను కోర్టులో హాజరు పర్చున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.

ACB RAIDSACB TELANGANAACB TrapCyber crimeTELANGANA ACB
Comments (0)
Add Comment