Vemulawada: రాజన్న సన్నిధిలో రోడ్ల వెడల్పు పనులు స్టార్ట్…

దిశ దశ, వేములవాడ:

దక్షిణ కాశీగా వాసికెక్కిన వేములవాడ రాజన్న సన్నిధిలో రోడ్ల వెడల్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అధికారులు. పట్టణంలోని మూలవాగు వంతె నుండి రాజన్న గుడికి వెల్లే దారిని 80 ఫీట్ల వెడల్పు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకునే పనిలో నిమగ్నం అయింది యంత్రాంగం. ఇప్పటికే భూ సేకరణకు సంబంధించిన సర్వే పూర్తి చేసిన అధికారులు 243 మంది నిర్వాసితులను గుర్తించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం 60 మందికి ప్రభుత్వం పరిహారం చెల్లించగా మిగతా నిర్వాసితులకు సంబంధించిన నగదును కోర్టులో డిపాజిట్ చేశామని అధికారులు వెల్లడించారు. భూ సేకరణ కోసం రూ. 47 కోట్లు కెటాయించినట్టుగా తెలుస్తోంది.

144 సెక్షన్…

మరో వైపున రాజన్న ఆలయానికి ప్రధాన రహదారి వెడల్పు కార్యక్రమంలో భాగంగా కూల్చివేతలకు శ్రీకారం చుట్టడంతో పట్టణంలో 163 ఆఫ్ (3) BNSS యాక్ట్, (సెక్షన్ 144 Crpc యాక్ట్) అమలు చేస్తున్నట్టు రెవెన్యూ అధికారులు ప్రకటించారు. రోడ్లు వెడల్పు ప్రక్రియ ముగిసే వరకు ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని వెల్లడించారు.

flash newsRAJANNA GUDIsri raja rajeshwara templetelangana newsvemulawada