జగిత్యాల హైవేపై ఢీ కొన్న కార్లు

ఒకరు మృతి… నలుగురికి గాయాలు

దిశ దశ, గంగాధర:

కరీంనగర్, జగిత్యాల హైవేపై కొద్దిసేపటి క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడగా మరో నలుగురికి గాయాలయ్యాయి. సంఘటనా వివరాల్లోకి వెల్తే… గంగాధర మండలం కురిక్యాల క్రాసిగ్ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొట్టుకోవడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వాసి, కరీంనగర్ వావిలాపల్లి నివాసి సోమినేని అజయ్(37) అక్కడిక్కడే మృతి చెందగా మరో నలుగురికి గాయలయ్యాయి. గంగాధరలో ఓ వేడుకలో హాజరై కరీంనగర్ తిరిగి వెల్తున్న అజయ్ కారును కరీంనగర్ వైపు నుండి వెల్తున్న మరో కారు ఎదురెదురుగా ఢీ కొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి సన్నిధి నుండి కొండగట్టు అంజన్న దర్శనానికి వెల్తున్నారని తెలుస్తోంది.

crimecrime newsCRIME TODAYtelangana crimetelangana crime newstoday crime news