21న రివ్యూ మీటింగ్: కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్న సీఎం

దిశ దశ. హైదరాబాద్:

రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 21న నిర్వహించతలపెట్టిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. జిల్లాల వారిగా  జరుగుతున్న అభివృద్దితో పాటు వివిధ అంశాలపై  సమీక్ష జరపనున్నారు. ప్రధానంగా భూ రికార్డులతో ఏర్పడిన సమస్యలు, కౌలు రైతులకు కూడా రైతు బంధు అమలు చేస్తామని ఎన్నికలప్పుడు వాగ్దానం ఇచ్చిన నేపథ్యంలో కౌలు రైతులను గుర్తించే విషయం గురించి కూడా ముఖ్యమంత్రి కలెక్టర్లతో మాట్లాడనున్నారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు, మహా లక్ష్మీ పథకం అమలు కోసం చేపట్టవల్సిన చర్యల గురించి చర్చించనున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా ముఖ్యమంత్రి కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో పలు కీలకమైన అంశాలపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. పరిపాలన అంశాలపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం.

breaking newsReview meeting with collectors on 21st of this month: CM Revanth Reddy's decisiontelangana cm revanth reddytelangana news
Comments (0)
Add Comment