దిశ దశ, వరంగల్:
ములుగు జిల్లా ముత్యాలదార వాటర్ ఫాల్స్ సందర్శకులను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశామని ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన వివరిస్తూ… డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ను సమాచారం అందిన వెంటనే రంగంలోకి దింపామని, అడవిలో చిక్కుకున్న పర్యాటయకులను కాపాడి తీరుతామన్నారు. వెంకటాపూర్ మండల అటవీ ప్రాంతంలో చిక్కుకున్న టూరిస్టులతో ఫోన్లో మాట్లాడిన ఎస్పీ ధైర్యంగా ఉండాలని, ఎత్తైన ప్రదేశంలో ఉండాలని సూచించారు. వాగు దాటే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని, రెస్క్యూ ఆఫరేషన్ టీమ్స్ ను పంపించామని వారితో పాటు ఆహారా పదార్థాలతో పాటు సేఫ్టీ కోసం తీసుకోవల్సిన ఇతరాత్ర చర్యలకు సంబంధించిన మెటిరియల్ కూడా పంపించినట్టు ఎస్పీ బాధితులకు వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో దిగులు పడి మనో ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని కూడా ఆయన సూచించారు.