బాబాయ్ వద్దన్నారు… అబ్బాయ్ ఫ్లెక్సీలు తీసేశారు… నందమూరి ఇంట బయటపడుతున్న విబేధాలు

దిశ దశ, హైదరాబాద్:

నవరస నటసార్వ భౌముని ఇంట నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా..? జూనియర్ విషయంలో సీనియర్ తనయులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారా..? ఇంతకాలం బాబు ఫ్యామిలీ ఒక్కటే ఆయనపై కక్ష్యగట్టారని అనుకున్నారంతా. కానీ తాజాగా సీనియర్ ఎన్టీఆర్ వర్థంతి రోజున బాలయ్య ఇచ్చిన ఆదేశాలతో నందమూరి కుటుంబం కూడా జూనియర్ విషయంలో కత్తిగట్టినట్టుగా స్పష్టం అవుతోంది.

ఎన్టీఆర్ ఘాట్ లో ఏం జరిగింది..? 

సీనియర్ ఎన్టీరామారావు వర్థంతి సందర్భంగా జరిగిన ఘటనతో జూనియర్ అభిమానుల్లో నిరాశ మొదలైంది. పెద్దాయన వర్థంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఘాట్ వద్దకు చేరుకున్న బాలయ్య జూనియర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో నందమూరి ఫ్యామిలీ అంతా కూడా గుర్రుగా ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. ఇటీవల ఏపీలో జరిగిన  సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సభా వేదిక వద్ద జూనియర్ అభిమానులు ఆయన ఫ్లెక్సీలను ప్రదర్శించారు. దీంతో టీడీపీ శ్రేణులు వారిపై దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. దీంతో జూనియర్ విషయంలో బాబుతో పాటు బాలయ్య కూడా ఆగ్రహంగా ఉన్నట్టు స్పష్టం అవుతోంది. 

BALAKRISHNAJunior NTRNTR death anniversaryTDP family politicsTelugu Desam Party
Comments (0)
Add Comment