ఆ కేసులు ఎత్తేయండి… ఆ డబ్బులు వాపస్ ఇవ్వండి

మావోయిస్టు పార్టీ డిమాండ్

దిశ దశ, పెద్దపల్లి:

రామగుండం ఎరువుల కర్మాగారంలో శాశ్వత ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను నిండా ముంచిన దళారుల ముందు మావోయిస్టు పార్టీ డిమాండ్ ఉంచింది. ఈ మేరకు జెఎండబ్లూపి కార్యదర్శి వెంకటేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. పెద్దపల్లి గౌరెడ్డిపేటకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుమారు 30 మంది నిరుద్యోగుల వద్ద డబ్బులు తీసుకున్నారని, శాశ్వాత ఉద్యోగాలని చెప్పి మోసం చేశారని వెంకటేశ్ ఆరోపించారు. తమకు అన్యాయం చేశారని తమవద్ద తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలని అడుగుతున్న బాదితులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే గ్రామంలో ముగ్గురు అధికార పార్టీ నాయకులు ప్రభఉత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటూ… తమ మాట వినని వారిపై బెదిరింపులకు పాల్పతున్నారన్నారు. దళితులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని కూడా వెంకటేశ్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.

crime newsLatest NewsmaoistPeddapallirfcltelangana news