కాంగ్రెస్ ఆఫీసుల ముందు కాషాయం ప్రార్థనలు

దిశ దశ, హైదరాబాద్:

కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద కాషాయం జెండాలు ఎగరనున్నాయి. కాషాయ జెండాలతో నాయకులు ప్రార్థనలు చేసే పనిలో నిమగ్నం కానున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆఫీసుల ముందు బీజేపీ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు జరిపనున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా బీజేపీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ ను నిషేదిస్తామని మేనిఫెస్టోలో పేర్కోన్న విషయంపై బండి సంజయ్ తీవ్రంగా పరిగణించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మం కోసం ముందుండి పోరాడే భజరంగ్ దళ్ సంస్థపై నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం అభ్యంతరకరమన్నారు. గోరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న సంస్థను బ్యాన్ చేయాలనుకోవడం దుర్మార్గమైన చర్యగా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాలు, నాయకుల ఇళ్ల ఎదుట హన్ మాన్ చాలీసా పారాయణం చేయాలని సూచించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

bandi sanjaybandi sanjay kumarbandi sanjay mpbjp newscm kcrCONGRESS NEWSLatest Newstelangana newstpcctpcc chief revanth reddy