కాళేశ్వరం బ్యారేజ్ ఫోటోలు తీసిన రాహుల్ గాంధీ

దిశ దశ, భూపాలపల్లి:

ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ గురువారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, స్థానిక ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టి జీవన్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావులు ఆయనతో పాటు మేడిగడ్డ బ్యారేజీ వంతెనపైకి వెళ్లారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఇంజనీర్లను బ్యారేజీ డ్యామేజీ గురించి అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీ వంతనె మీదుగా నడుచుకుంటూ వెళ్లిన రాహుల్ గాంధీ వంతెనేపై వచ్చిన పగుళ్లు, కుంగిపోయిన పిల్లర్ పరిసరాలతో పాటు బ్యారేజీ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బ్యారేజ్ పై ఫోటోలు తీస్తున్న ఫోటో కూడా నెట్టింట వైరల్ అయింది.



kaleshwaamkaleshwaram projectmedigadda barragerahul gandhiRahul Gandhi visited Medigadda