సిజేరియన్లకు బదులు… సెలూన్ చేస్తున్నారా..?

రామగుండం మెడికల్ కాలేజీలో వెరైటీ ర్యాగింగ్…

దిశ దశ, పెద్దపల్లి:

వైద్య వృత్తిలో పట్టాలు పొంది సీజర్లతో సిజేరియన్ చేయాల్సిన డాక్టర్లు ర్యాగింగులకు పాల్పుడుతూ ఏకంగా సెలూన్ చేయడం ఆరంభించారు. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని శారదనగరలో ఉన్న రామగుండం మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది. జూనియర్ మెడికోలను సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడిన ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఓ జూనియర్ తల వెంట్రుకలు, మీసాలు కట్ చేసిన సీనియర్ల తీరుపై జూనియర్ మెడికోలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శిరోముండనానికి పాల్పడడం చట్టరిత్యా నేరమన్న విషయంతో పాటు ఇతర మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ కు పాల్పడిన కఠినంగా వ్యవహరించేందుకు నిభందనలు కూడా సవరించబడ్డాయి. జూనియర్లను గేలిచేయాలన్న అత్యుత్సాహంతో సీనియర్లు తమ ఉజ్వల భవిష్యత్తును కూడా నాశనం చేసుకునే ప్రమాదం లేకపోలేదు.

Latest NewsmedicoRaggingRamagundam Medical Collegetelangana news