House surgeons’ protest: నో పే… నో వర్క్… హౌజ్ సర్జన్ల ధర్నా…

ప్రతిమ మెడికల్ కాలేజీ వద్ద నిరసన

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ సమీపంలోని నగునూరు ప్రతిమ మెడికల కాలేజీ ముందు హౌజ్ సర్జన్ల నినాదాలతో దద్దరిల్లిపోయింది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాలేజీ మెయిన్ గేటు ముందు ధర్నా నిర్వహించారు. ప్రతిమ మెడికల్ కాలేజీలో ఇంటెన్షిప్ చేస్తున్న తమ సేవలు వినియోగించుకుంటున్నారని కానీ స్టైఫండ్ ఇవ్వడంలో మాత్రం వివక్ష చూపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ప్రతి నెల స్టైపండ్ ఇస్తున్నా వాటిని తమకు చెల్లించకుండా తమతో మాత్రం ఇష్టారీతిన సేవలు చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయంగా రావల్సిన స్టైఫండ్ తమకు ఇవ్వకుండా ప్రతిమ కాలేజీ యాజమాన్యం తమకు అన్యాయం చేస్తోందని హౌజ్ సర్జన్లు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితి రాష్ట్రంలోని ఇతర మెడికల్ కాలేజీల్లో కూడా ఉందని అయితే మల్లారెడ్డి మెడికల్ కాలేజీ, మెడిసిటీ కాలేజీల్లో స్టూడెంట్స్ చేసిన ఆందోళనలతో యాజమాన్యాలు దిగివచ్చాయని కూడా వివరించారు. ప్రతిమ మెడికల్ కాలేజీ యాజమాన్యం కూడా తమకు రావల్సిన స్టైఫండ్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నో పే… నో వర్క్ అంటూ హౌజ్ సర్జన్లు నినాదాలు చేశారు.

karimnagar newsLatest NewsMEDICAL COLLEGEPratima Medical Collegetelangana news