ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా..!

దిశ దశ, న్యూ ఢిల్లీ:

భారత ప్రధాని నరేంద్ర మోడీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందించారు. తాత్కాలిక ప్రధానిగా ఉన్న ఆయన్ను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి ఆహ్వానించారు. ఏన్డీఏ కూటమి పార్టీల ప్రతినిధులు ప్రధానిగా నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తూ లేఖలు అందించనున్నాయి. జూన్ 8న మూడో సారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వరుసగా మూడు సార్లు ప్రధాని పీఠం ఎక్కిన నేతగా పండిట్ జవహార్ లాల్ నెహ్రూ రికార్డును నరేంద్ర మోడీ సమం చేయనున్నారు.

2024 electi0nsbjp newsNarendra modiPm narendra modi