దిశ దశ, హైదరాబాద్:
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జీగా కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేవకర్ ను బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. సహ ఇంఛార్జీగా సునీల్ జీ బన్సాల్ ను యథావిధిగా కొనసాగించాలని భావించింది. మూడు రోజుల క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చిన జాతీయ పార్టీ తాజాగా ఇంఛార్జీగా ఉన్న తరుణ్ ఛుగ్ స్థానంలో జవదేవకర్ ను నియమించడం గమనార్హం. జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే రాష్ట్రంలో సంస్థాగత మార్పులు కూడా తప్పవని స్పష్టమవుతోంది.