జంట నగరాల్లో పోలీసుల జల్లెడ

బీజేపీ నేతల అరెస్ట్ కోసం కొనసాగుతున్న వేట

దిశ దశ, హైదరాబాద్:

జంట నగరాల్లో పోలీసులు బీజేపీ నాయకుల కోసం జల్లెడ పడుతున్నారు. ఓ వైపున జోరుగా వర్షం కురుస్తున్న పోలీసులు మాత్రం బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నుండి డివిజన్ స్థాయి నాయకులందరిని కూడా అరెస్ట్ చేసే పనిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు రంగంలోకి దిగారు. శామీర్ పేటలోని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఇంటికి కూడా పోలీసులు భారీగా చేరుకున్నారు. ఆయన మెయిన్ గేటు వద్ద పోలీసు వాహనంలో పహారా కాస్తున్నారు. పంపిణీకి నోచుకోని బాటసింగారం డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించాలని బీజేపీ పిలుపునిచ్చింది. గురువారం బీజేపీ చేపట్టనున్న ఈ నిరసన కార్యక్రమానికి బీజేపీ క్యాడర్ వెల్లొద్దని, వారిని ఎక్కడికక్కడ నిలువరించాలని ఆదేశాలు రావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేస్తున్నట్టుగా సమాచారం. ఈటలతో పలువురు బీజేపీ నాయకులను గృహనిర్భందంలో పోలీసులు ఉంచినట్టుగా తెలుస్తోంది.

bjp newscm kcreatela rajendaretela rajenderLatest Newstelangana news