పవన్ కళ్యాణ్‌కు ఆడ వాళ్లంటే పిచ్చి.. ఉమైర్ సందు సంచలన ట్వీట్

సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజీ మరో హీరోకు లేదనే చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ అంటే చాలు చాలా మందిలో పూనకాలే వస్తాయి. అంటే అంత మందికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఇక పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఏ సినిమా విడుదల అయినా ఆ సందడి మాములుగా ఉండదు. థియేటర్స్ ముందు ఆ హడావిడే వేరు అంటారు కొందరు.
అలాంటి హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన పవన్, తొలి ప్రేమ సినిమాతో మంచి సక్సెస్ అందుకుననాడు. ఇక ఇప్పుడు ఆయన రాజకీయాల మీద ఫొకస్ చేసి.. తనదైన స్టైల్లో అధికార పార్టీపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ.. రాకియాల్లో చాలా యాక్టివ్ అయిపోయడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై ఎన్నో రూమర్స్ తెరపైకి వస్తుంది. ప్రతీ సారి ఆయన పెళ్లీల విషయం తీసి పవన్‌ను విమర్శించడం అనేది చాలా కామన్ అయిపోయింది.

అయితే తాజాగా..ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్ అలాగే సౌత్ ఏషియా ఫిలిం క్రిటిక్ అయిన ఉమైర్ సందు పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ని “డై హార్డ్ ఉమరైజర్” అంటూ ట్వీట్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియా లో వివాదాస్పదంగా మారింది.

అంతే కాదు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయాన్ని చెబుతూనే అలాగే హీరోయిన్లతో కూడా పవన్ కళ్యాణ్ అలా చేశాడు..అంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ ట్వీట్ పై అటు మెగా అభిమానులు, ఇటు పవన్ అభిమానులు మండిపడుతున్నారు. ఇక దీనిపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి అంటున్నారు కొందరు.
https://twitter.com/UmairSandu/status/1634496317144592386?s=20

MEGA BROTHERSPawan KalyanTollywood Latest NewsTollywood News