రైల్వే స్టేషన్ లో ప్రయాణీకుల నిరసన

దిశ దశ, మహబూబాబాద్:

మహబూబాబాద్ రైల్వే స్టేషన్ జీఆర్పీ ఠాణా ముందు ప్రయాణీకులు ఆందోళన చేపట్టారు. కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న మహిళల పట్ల టీసీ వ్యవహరించిన తీరుపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కోణార్క్ రైళ్లో ప్రయాణిస్తున్న మహిళల పట్ల టీసీ పరుశపదజాలంతో దూషించి చేయి చేసుకున్నాడంటూ ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. సదరు టీసీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రయాణీకులు డిమాండ్ చేశారు. రైల్వే అదికారులు ప్రయాణీకుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Latest NewsmahaboobabadMahabubabadPassengers protest at Mahabubabad railway stationtelangana news