సంపుకుంటారా..? సాదుకుంటారా..?… పాడి కౌశిక్ రెడ్డి ఎమోషనల్ స్పీచ్…

దిశ దశ, హుజురాబాద్:

మరి కొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థులు చివరి సారి ఓటు అభ్యర్థించే పనిలో నిమగ్నం అయ్యారు. హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి కమలాపూర్ మండల కేంద్రంలో చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. సంపుకుంటారా..? సాధు కుంటారా మీ ఇష్టం… నేను నా భార్య నా బిడ్డ మా ముగ్గుర్ని చంపుకుంటారా సాధు కుంటారా మీ ఇష్టం అంటు కౌశిక్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. నన్ను ఓడగొడితే నేను ఇక్కడ ఉరి తీసుకోవాల్నా మీ ఇష్టం… ఇక మీరు ఏం చేస్తారో మీ ఇష్టం… నాకు ఓటు వేయకుంటే… మా ముగ్గురి శవాల్ని మీరు చూడాలన్నారు. ఓటేసీ లీడిస్తే జయ యాత్రకు వస్తా… లేకుంటే 4వ తారీఖును మా ముగ్గురి శవయాత్రకు మీరు రావలన్నారు. మీ దయ అంటున్నా… మీ దండం అంటున్నా… మీ కడుపుల తలకాయ పెడతా అంటున్న… మీ గదుమలు పట్టుకుంటా అంటున్నా ఒక్కసారి అవకాశం ఇవ్వండి వేడుకున్నారు. ఒక్క సారి మీరు కాపాడుకుంటారని అనుకుంటున్నాని అన్నారు.

2023 assembly electionscm kcrhuzurabadmlc padi koushik reddyPadi Kaushik Reddy's emotional speech