మధురై కోర్టులో మన ఎమ్మెల్యేలు: మాణిక్కం ఠాగూర్ ట్విట్

దిశ దశ, జాతీయం:

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మధురై కోర్టుకు హాజరయ్యారు. వీరు కోర్టు ఆవరణలో కూర్చున్న ఫోటోలను ‘ఎక్స్’ వేదికగా ట్విట్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్కం ఠాగూర్. బుధవారం నాడు ఎల్ బినగర్ ఎమ్మెల్యలే సుధీర్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలు మధురై కోర్టుకు హాజరయ్యారంటూ ఆయన వెల్లడించారు. తనపై వచ్చిన ప్రతి ఆరోపణపై చట్టపరమైన చర్య తీసుకుంటామని స్పష్టం చేశారు. తనపై చేసిన తప్పుడు ఆరోపణలపై మధురై కోర్టులో పరువు నష్టం దావా కేసు వేశానని ఠాగూర్ వెల్లడింంచారు. కోర్టు ఆవరణలో కూర్చున్న ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కౌశిక్ రెడ్డిలపై మధురై కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ (NBW) జారి చేసిందని వివరించారు.
https://twitter.com/manickamtagore/status/1744989973311324634?t=IextlILst9ExIAeH_Mjujg&s=19

AICCbrs mlasBRS NEWSManickam Tagoretelangana news
Comments (0)
Add Comment