ఎస్సైని బ్రతికించిన బెలూన్లు…

దిశ దశ వరంగల్:

స్వీయ రక్షణ కోసం సీటు బెల్టు పెట్టుకోవడంతో ఆ ఎస్సై ప్రాణాలను కాపాడింది. దీంతో ప్రమాదానికి గురైన కారులలో బెలూన్లు ఓపెన్ కావడంతో ఆయన సేఫ్ అయ్యారు. సంఘటన వివరాల్లోకి వెల్తే… వరంగల్ కమిషనరేట్ పరిధిలోని వర్ధన్నపేట స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ కుమార్ మంగళవారం ఇల్లందు నుండి వర్ధన్నపేటకు సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ కారులో వస్తుండగా ఆకేరు వాగు ప్రమాదం సంభవించింది. ఆకేరు వాగు వద్దకు చేరుకుంటున్న క్రమంలో కుక్క అడ్డు రావడంతో దానిని తప్పించబోయాడు. దీంతో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిలోని ఆకేరు వాగులో కారు అదుపు తప్పి పడిపోయింది. సీటు బెల్టు పెట్టుకుని ఎస్సై ప్రవీణ్ కారు నడుపుతండడంతో బెలూన్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో ఆయన ప్రాణాపాయం తప్పిందని వర్దన్నపేట పోలీసులు తెలిపారు.

crimecrime newsCRIME TODAYwarangal crimeWarangal Districtwardannapet