ఆయిల్ ట్యాంకర్ బోల్తా… చెలరేగిన మంటలు…

దిశ దశ, జగిత్యాల:

జగిత్యాల జిల్లాలో భారీ ప్రమాదం సంభవించింది. మంగళవారం తెల్లవారు జామున జిల్లాలోని మెట్ పల్లి శివార్లలో జరిగిన ఈ ప్రమాదంతో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలోని  జాతీయ రహదారిపై ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదం జరిగిన వెంటనే ట్యాంకర్ నుండి మంటలు చెలరేగడంతో డ్రైవర్ బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని స్థానికులు ఫైర్ స్టేషన్ అధికారులకు ఇచ్చిన వెంటనే  రెండు ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే మంటల తీవ్రత విద్యుత్ తీగలను కూడా తాకడంతో కరెంటు సరఫరా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదం జరిగిన చోటే పెట్రోల్ బంక్ కూడా ఉండడంతో అగ్ని కీలలు విస్తరించుకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

accidentcrime newsJAGITIAL NEWSmetpallytelagnana crime
Comments (0)
Add Comment