నో ఎంట్రీ ఫర్ లీగల్ టీమ్…

బొమ్మల రామారం ఠాణా సీన్

దిశ దశ, నల్లగొండ:

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసు కస్టడిలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని కలిసేందుకు హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా వెల్లిన లీగల్ టీమ్ కు స్టేషన్ లోకి నో ఎంట్రీ చెప్పేశారు పోలీసులు. అడ్వకేట్లకు సెక్షన్ 35 ప్రకారం పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తితో మాట్లాడే హక్కు ఉందని కాబట్టి తమను బండి సంజయ్ తో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే పోలీసులు మాత్రం మీరు ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోండని స్టేషన్ లోపలకు రావల్సిన అవసరం లేదంటూ పోలీసు అధికారులు తేల్చి చెప్తున్నారు. తమతో అర్గ్యూమెంట్ చేయవద్దని కోర్టుకెళ్లాలని పదే పదే పోలీసు అధికారి అడ్వకేట్స్ తో చెప్పడం గమనార్హం. అయితే తాము ఖచ్చితంగా బండి సంజయ్ తో మాట్లాడుతామని లీగల్ టీమ్ వాదిస్తోంది. ఏ సెక్షన్ లో సంజయ్ ని కస్టడీలోకి తీసుకున్నారు ఇందుకు సంబంధించిన వివరాలు లేకుండా తామెలా కోర్టును ఆశ్రయిస్తామంటూ అడ్వకేట్లు పోలీసులను ప్రశ్నించారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు కూడా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

BANDI SANJYAY ARRESTbjp chief bandi sanjaybjp newsBOMMALA RAMARAMLatest Newstelangana news