BREAKING: కరీంనగర్ లో ఎన్ఐఏ సోదాలు

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మరోసారి కన్నెసింది. తాజాగా హైదరాబాద్ నుండి వచ్చిన ఎన్ఐఏ అధికారుల బృందం కరీంనగర్ లో సోదాలు చేపట్టింది. కరీంనగర్ కు చెందిన ఓ వ్యక్తి గతంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను విదేశాల్లో ఉపాధి పొందతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎన్ఐఏ అధికారుల బృందం అతని ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా కరీంనగర్ కు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం తెల్లవారు జామునే కరీంనగర్ చేరుకున్న ఎన్ఐఏ టీమ్ సదరు అనుమానిత వ్యక్తి ఇంట్లో సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టడం కలకలం సృష్టిస్తోంది.

karimnagar newsLatest NewsNIANIA searches in Karimnagartelangana news