త్రిపుర గవర్నర్ గా ‘నల్లు’

దిశ దశ, హైదరాబాద్:

బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డికి త్రిపుర గవర్నర్ గా, ఒడిశా గవర్నర్‌గా ఝార్ఖండ్‌ మాజీ సీఎం రఘుబర్‌ దాస్‌లను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. సూర్యాపేట జిల్లాకు చెందిన నల్లు ఇంద్రసేనా రెడ్డి మలక్‌పేట నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర చేరికలు, సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జాతీయ కమిటీలో కూడా బాధ్యతలు నిర్వర్తించిన నల్లు ఇంద్రసేనా రెడ్డి సీనియర్ నాయకుల్లో ఒకరు. ఒడిశా గవర్నర్‌గా నియమితులైన రఘుబర్‌దాస్‌ ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు ఆయన జార్ఖండ్‌ సీఎంగా పనిచేశారు.

bjpLatest NewsNallu Indrasena Reddy as Governor of Tripuratelangana news