వాళ్లిద్దరూ ఒక్కటవుతున్నారా..?

చైతూ… సామ్ మళ్లీ ఒక్కటవుతున్నారా..? విడాకులతో దూరం అయిన వారిద్దరూ కలిసిపోనున్నారా..? ఇప్పుడిదే డిస్కషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే ఈ జంట గురించి ఇప్పుడు జరుగుతున్న చర్చ నిజమయితే బావుండూ అని అభిమానులు ఆశిస్తుంటే… అవునా నిజమా అని అంటున్నారు కొంతమంది. టాలివుడ్ లో బెస్ట్ కపుల్ గా ఉన్న నాగచైతన్య, సమంతలు అనుకోకుండా అనూహ్య పరిణామాల మధ్య విడిపోయిన సంగతి తెలిసిందే. వెండి తెరపై అందరిని ఆలరించిన ఈ జంట నిజ జీవితంలోనూ ఒక్కటై అందరికీ ఆదర్శంగా నిలిచారన్న ఆనందాన్ని శాశ్వతంగా ఉంచలేకపోయాయి పరిస్థితులు. అనుకోకుండా చైతు, సామ్ విడాకులు తీసుకోవడంతో ఫ్యాన్స్ కోలుకోలేని షాక్ కు గురయ్యారనే చెప్పాలి. అయితే ఈ జంట విడిపోయినప్పటి నుండి వీరి గురించి ఏదో ఒక చర్చ సాగుతూనే ఉంటోంది. రీసెంట్ గా సమంత మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసి ఫ్యాన్స్ మూడ్ ఆఫ్ అయింది. అయితే వీరిద్దరూ ఒక్కటైపోతున్నారన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ అంతటా పాకిపోయింది. చాలా కాలం కలసి ట్రావెల్ చేసిన వీరిద్దరూ దూరంగా ఉంటున్నప్పటికీ చైతు సామ్ ను పలకరించాడట. అయితే చైతూ తీయబోతున్న ప్రాజెక్టు కోసం వీరిద్దరూ జట్టు కట్టబోతున్నారని, ఇప్పటి వరకూ జరిగిన ఘటనలకు స్వస్తి పలికి వృత్తి పరంగా మాత్రం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే విడిపోయి కలిసి నటించిన జంటగా రికార్డుకెక్కనుంది ఈ కపుల్. ఈ ఇద్దరూ మళ్లీ వెండి తెరపై కనిపనిస్తే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే మూవీ చూసేందుకు అభిమానులు థియేటర్ లకు క్యూ కడతారన్న టాక్ కూడా ఇండస్ట్రీలో సాగుతోంది. ఆల్ ది బెస్ట్ సామ్… చైతూ…

Latest NewsNaga ChaitanyaNaga Chaitanya and Samantha getting together?Naga Chaitanya and Samantha will team up again for a new movie projectNaga Chaitanya Samantha Movienew movieSamanthatelangana newsTollywood couples are going to meet..Tollywood Latest NewsTollywood Newstrs mla