కరీంనగర్ లో మర్డర్

ఉగాది పండుగ రోజు కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ యువకుడి గొంతుకోసి మరీ దారుణంగా చంపేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… కరీంనగర్ విద్యానగర్ వాటర్ ట్యాంక్ పీటీసీ రోడ్డులో మూసేసిన ఓ ప్రైవేటు పాఠశాల ఆవరణలో పురంశెట్టి నరేందర్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నరేందర్ గొంతు కోసి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. నరేందర్ తో పాటు మరికొందరు కలసి ఆ ప్రాంతంలో మద్యం సేవించినట్లు ఆనవాళ్లు. ఘటనా స్థలంలో లభ్యమైన లిక్కర్ బాటిల్స్ ను బట్టి మద్యం నరేందర్ తో కలిసి మద్యం సేవించిన వారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. మరో వైపున కుటుంబ కలహాలు కూడా ఈ హత్యకు కారణమని కూడా అనుమానాలు వ్యక్తం అవుతోంది. కరీంనగర్ సంతోష్ నగర్ కు చెందిన నరేందర్ ఆస్ట్రేలియాకు ఉపాధి కోసం వెల్లి ఇటీవలే స్వస్థలానికి చేరుకున్నట్టు సమాచారం. ఘటనా స్థలాన్ని కరీంనగర్ టౌన్ ఏసీపీ తుల శ్రీనివాస్ రావు, సీఐ లక్ష్మీ బాబులు సందర్శించారు. మర్డర్ కు కారణాలేంటో తెలుసుకోవాలని, వివిధ కోణాల్లో ఆరా తీయాలని పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

crime newsCRIME TODAYkarimnagar cpkarimnagar news