కల్వకుంట్ల కవితకు స్వల్ప అస్వస్థత

ఐదు నిమిషాల్లో తేరుకున్న ఎమ్మెల్సీ

దిశ దశ, జగిత్యాల:

విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శనివారం జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలలో రోడ్ షో నిర్వహిస్తున్న క్రమంలోనే కవిత సృహ కోల్పోయారు. కొద్దిసేపు అస్వస్థత నుండి తేరుకునే ప్రయత్నం చేసినప్పటికీ సఫలం కాకపోవడంతో ప్రచార వాహనంలోనే కూర్చుండి పోయారు. కవిత వెంట ఉన్న మహిళా నాయకురాల్లు సపరిచర్యలు చేశారు. ఐదు నిమిషాల తరువాత కుదుటపడ్డారు.

2023 assembly electionsLatest NewsMLC Kavitha is slightly unwelltelangana news